కనిగిరి: తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం: ఒంగోలులో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి
కనిగిరి: తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సూచించారు. ఒంగోలులో ఆదివారం జరిగిన జిల్లాలోని టిడిపి మండల పార్టీల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల సమావేశం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్త పార్టీకి వెన్నుముక అనే నినాదంతో ప్రతి నాయకుడు పనిచేయాలని సూచించారు. ప్రతి మండలంలో పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.