కనిగిరి: డివిజన్ పరిధిలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి: కనిగిరి విద్యుత్ శాఖ EE ఉమాకాంత్
కనిగిరి డివిజన్ పరిధిలో వేసవి తీవ్రతతో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ, ఎక్కడ కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కనిగిరి విద్యుత్ శాఖ ఈఈ ఉమాకాంత్ శుక్రవారం తెలిపారు. తీవ్రమైన గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, తీగలు తెగిపడడం , చెట్లు కూలిపోవడం వల్ల ఏర్పడ్డ సమస్యలను సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడినా, తీగలు తెగిపడినా వెంటనే సమాచారాన్ని అందించాలని ఈ ఈ ఉమాకాంత్ ప్రజలకు సూచించారు. వెంటనే ఆ ప్రవతమై సిబ్బందితో సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.