రాప్తాడు: కక్కలపల్లి వద్ద ఏబీఎన్ రాధాకృష్ణ, ఆర్ వి నాయుడు కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి సమీపంలోనే ఉన్న ఏ సెవెన్ కన్వెన్షన్ హాల్ వద్ద మంగళవారం 12 గంటల 20 నిమిషాల సమయంలో వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణ, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ కళ్యాణి విజయ్ మనోహర్ శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిత్యం ఏబీఎన్ రాధాకృష్ణ అసత్య కథనాలు రాసు సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నారని, టిటిడి చైర్మన్ నాయుడుని కూడా ఆ పదవి నుంచి తొలగించాలని వైయస్సార్ పార్టీ మహిళలు డిమాండ్ చేశారు.