కనిగిరి: పట్టణంలో ఈ నెల 16న నిర్వహించే పొగాకు రైతు దీక్ష కార్యక్రమానికి సంబంధించిన వైసిపి జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి
కనిగిరి పట్టణంలో ఈనెల 16వ తేదీన పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొగాకు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులో కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ తో కలిసి కనిగిరిలో నిర్వహించనున్న దీక్ష కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శివప్రసాద్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కనిగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ఈ దీక్షా కార్యక్రమానికి రైతులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.