ఉరవకొండ: శ్రీ శ్రీ ఎర్రి తాత దేవాలయంలో హుండీ లెక్కింపు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శాంతి ధామంలో వెలిసిన అవధూత శ్రీ ఎర్రితాత దేవాలయంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు, హుండీ లెక్కింపు కార్యక్రమంలో అవధూత శ్రీ ఎర్రితాత సేవా కమిటీ కార్యకర్తలు మల్లికార్జున, రిటైర్డ్ ఉపాధ్యాయులు పర్వతన్న, ఈశ్వరప్ప, అనిల్ కుమార్, రుద్రమణి, వెంకటేష్, నగేష్, నర్సింహులు తదితరులు పాల్గొని శ్రీ ఎర్రి తాత హుండీ లెక్కింపు నిర్వహించగా 87,919(ఎనబై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ) ఆదాయము వచ్చింది .ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శంకరన్న , గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.