రాయదుర్గం: పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత : రాయదుర్గం తహసీల్దార్ సూర్యప్రతాప్
PGRS లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాయదుర్గం తహసీల్దార్ సూర్యప్రతాప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నెలలో 4 సార్లు నిర్వహించిన సభల్లో మొత్తం 73 అర్జీలు అందగా, వాటిలో 45 అర్జీలు పరిష్కరించామని, 25 అర్జీలు పురోగతిలో ఉన్నాయన్నారు. తమ దృష్టికి వచ్చిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. పట్టణంలోని కొన్ని లేఔట్లలో మధ్యవర్తులను నమ్మి ప్రజలు మోసపోతున్నట్లు గుర్తించామన్నారు. ఎవరూ మధ్యవర్తులను నమ్మవద్దని, అర్హత ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.