కనిగిరి: రైతులు తప్పనిసరిగా తమ పంటలకు బీమా చేయించుకోవాలి: పెద్ద చెర్లోపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి రంగ కృష్ణ
పెద్ద చెర్లోపల్లి: రైతులు తాము పండించిన పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని పెద్ద చర్లపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి రంగకృష్ణ సూచించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి రైతు సేవా కేంద్రంలో రైతు పిలుస్తుంది కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా తమ పండించిన పంటల వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలా నమోదు చేసుకున్న రైతులకే బీమా వర్తిస్తుందన్నారు. వరి పంటకు ఆగస్టు 15, మిగిలిన పంటలకు 31వ తేదీ లోపు ప్రభుత్వం నిర్ణయించిన ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలని ఆయన సూచించారు.