కనిగిరి: ఫేక్ కాల్స్, అక్రమ నగదు వసూళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి: ఫేక్ కాల్స్ మరియు అక్రమ నగదు వసూళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ హెచ్చరించారు. కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.... మున్సిపాలిటీ పరిధిలో కొందరు వ్యక్తులు వ్యాపార సంస్థలు, షాపుల యజమానుల వద్ద స్కానింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ నగదును వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు. ట్రేడ్ లైసెన్సులు కేవలం జనవరి, ఫిబ్రవరి మాసంలోనే వసూలు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు. ఇటువంటి వ్యక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.