సంతనూతలపాడు: రైతులపై ప్రత్యేక శ్రద్ధపెట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు మండలం చల్పపాలెంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కూడా బిగించామన్నారు. లోకేశ్ పాదయాత్రలో కారుమంచి కాలువ అభివృద్ధి పనులకు హామీ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో JCB వాహనాన్ని నడిపి ఎమ్మెల్యే విజయ్ కుమార్ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.