ఉరవకొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన ఆర్థిక,సర్వీసు సమస్యల పరిష్కరించాలని ఈనెల 14న కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంల పికెటింగ్
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన ఆర్థిక,సర్వీసు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నందుకు నిరసనగా జూలై 14న జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీ మరియు పికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఆర్. శ్రీనివాస్ నాయక్ అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ మండల ప్యాప్టో నాయకులు తిప్పేస్వామి,వజీర్ భాష, శ్యాంసుందర్ ఆధ్వర్యంలో జూలై 14న నిర్వహించనున్న కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.