సంతనూతలపాడు: నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో బడి పిలుస్తుంది పేరుతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆదివారం వినూత్నంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ ఉప్పుగుండూరులో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కొనసాగించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని, ఇటీవల పాఠశాలలో చదివిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఉచితంగా సీట్లు సాధించారని వివరిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని విద్యార్థులు కొనసాగించారు.