ఉరవకొండ: టీబీ వ్యాధిపై అపోహాలు వీడండిని
కొనకొండ్ల గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభయాన్ కార్యక్రమం
"టీబీ వ్యాధిపై అపోహాలు వీడండి" వజ్రకరూరు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురువారం నిర్వహించి 2030 నాటికి టీబీ అంతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని ఆరోగ్య విస్తరణ అధికారులు గురు ప్రసాద్, కుమారస్వామి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ టీబీ వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ముఖ్యంగా పొగాకుతో చేసిన ఉత్పత్తులను వాడే వారికి పరిశ్రమల్లో దుమ్ముదులికి పనిచేసే వారికి ఈ కార్యక్రమం ద్వారా 150 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు.