రాప్తాడు: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఎంతో సహకారం అందించాడు అనంతపురంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం 11 గంటల సమయంలో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ 17వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలిసి దళిత సంఘం నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్ డి టి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆసుపత్రులు వ్యవసాయ పరికరాలు పాఠశాలలు ఆర్డిటి స్టేడియం ఇలా ఎన్నో నెలకొల్పి పేదల అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి ఇన్సెంటి ఫెర్రర్ అని రాప్తాడు ఎమ్మార్పీఎస్ ఓబులేసు పేర్కొన్నారు.