యర్రగొండపాలెం: దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాత్రి సైతం వెలుగొండ టన్నెల్ లో ఉండి లైనింగ్ బెంచింగ్ పనులను పరిశీలించారు. కార్మికులతో కలిసి భోజనం చేశారు. వారి యొక్క యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్సులో 19 కిలోమీటర్లు ప్రయాణించి ఐదు గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను పరిశీలించారు.