సంతనూతలపాడు: సంతనూతలపాడు లోని శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రవణా నక్షత్ర వేడుకలు
సంతనూతలపాడు లో కొలువైన శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణా నక్షత్ర వేడుకలను వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పాలు, నెయ్యి, వివిధ రకాల పూలతో పండితులు అభిషేకించారు. శ్రవణా నక్షత్ర వేడుకల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.