కనిగిరి: పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు
కనిగిరి పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం బందోబస్తు చర్యలను చేపట్టారు. పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలను చేపట్టారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో ప్రార్థనలు ముగిసే వరకు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.