ఉరవకొండ: పాల్తూరులో కడుపునొప్పి తాళలేక ఇంట్లోనే ఫ్యాను కు ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో కడుపునొప్పి తాళలేక ఇంట్లోనే ఫ్యాను కు ఉరి వేసుకుని పవిత్ర(17) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కడుపు నొప్పి తీవ్రత ఎక్కువ ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.