గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో బస్సు, కారు ఢీ, భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు పాత రైల్వే వంతెన వద్ద మూలములకు తిరుగుతున్న క్రమంలో కారును ఢీ కొట్టి తర్వాత కొండను ఢీకొంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వెళ్లే వాహనాలని ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. పోలీసులు బస్సును తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.