తాడిపత్రి: ఆలూరు కోనలో రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా గరుడ వాహనోత్సవం
తాడిపత్రి మండలం ఆలూరు కోనలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి వరకు గరుడ వాహనోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి గరుడ వాహనంపై విహరించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంతో పాటు పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.