కనిగిరి: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బిజెపి ఆవిర్భవించింది: బిజెపి మార్కాపురం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి
కనిగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని బిజెపి నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జెండాను వారు ఆవిష్కరించారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.... బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బిజెపి ఆవిర్భవించింది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమప్రాయాన్ని ఇతనిస్తూ అభివృద్ధి పథంలో ప్రధాని నరేంద్ర మోడీ నడిపిస్తున్నారు అన్నారు.