సంతనూతలపాడు: చీమకుర్తి మండలం కె.వి పాలెం లో రేపు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల, ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ
చీమకుర్తి మండలంలోని కె.వి పాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి వార్షిక తిరునాళ్ల కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయం కమిటీ నిర్వాహకులు బుధవారం తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకుల అర్చన, సింధూర లేపన కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్నం భక్తులు స్వామి వారికి పొంగళ్ళు సమర్పిస్తారని తెలిపారు. రాత్రి విద్యుత్ ప్రభలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.