ఉరవకొండ: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని రమనేపల్లి,బూదిగుమ్మ లోని ప్రముఖ ఆలయాలైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. భక్తులతో కలిసి పంచామృత అభిషేకాలు పుష్పాలంకరణ పూజలు కుంకుమార్చనలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద తీర్థప్రసాదాలు పంపిణీ కార్యక్రమాన్ని సేవా కమిటీ సభ్యులు నిర్వహించారు.