సంతనూతలపాడు: పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించే నిధులను పొదుపుగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్మికుల జీతాలు, మరియు అభివృద్ధి పనుల కోసం ఆ నిధులను వినియోగించాలన్నారు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.