సంతనూతలపాడు: ఉప్పుగుండూరు హైవేపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు నేషనల్ హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుగుండూరు హైవేపై ర్యాలీ ఆటోను , ప్రయాణికులతో వస్తున్న మరో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో వస్తున్న ఆటోలోని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయాల పాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.