ఉరవకొండ: ఉరవకొండ డివిజన్లో మలేరియా జ్వరాలు నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు : డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి కోదండరామిరెడ్డి
ఉరవకొండ డివిజన్లో మలేరియా జ్వరాలు నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి, పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జి సుస్మిత విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం మస్రాద జహ పెద్ద కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జై కుమార్ నాయక్ తదితరులు పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో మలేరియా దినోత్సవ ర్యాలీలను, వైద్యాధికారుల సమావేశాలను నిర్వహించారు.