రాప్తాడు: స్పీకర్ అయ్యన్నపాత్రుపై చర్యలు తీసుకోవాలి అనంతపురంలో రాప్తాడు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమధ్య ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఐదు గంటల సమయంలో దళితులపై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమధ్య ఓబులేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంటిమిట్ట ఓబులేసు మాట్లాడుతూ నర్సీపట్నంలో దళితులపై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అతని శాసన సభ్యత్వం కూడా రద్దు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ ఒంటిమిట్ట ఓబులేసు పేర్కొన్నారు.