రాప్తాడు: గొందిరెడ్డిపల్లిలో ప్రభాకర్ రెడ్డి జీవన్ కుమార్ రెడ్డి మా భూమిని అక్రమిస్తున్నారు రాప్తాడులో వెంకట్రామిరెడ్డి ఆవేదన
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శనివారం ఐదున్నర గంటల సమయంలో గొందిరెడ్డిపల్లికి చెందిన వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గొంతు రెడ్డి పల్లి గ్రామంలో సర్వే నంబర్ 932-1 15 సెంటు స్థలానికి 40 సంవత్సరాల క్రితమే పట్టా ఇవ్వడం జరిగిందని అయితే ప్రభాకర్ రెడ్డి జీవన్ కుమార్ సావిత్రమ్మ మా పొలాన్ని ఆక్రమించుకుంటున్నారని అడ్డుకున్నందుకు మాపైనే అక్రమంగా కేసు నమోదు చేయించడం జరిగిందని వెంకటరామిరెడ్డి తన జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరాలను వెల్లడించారు.