సంతనూతలపాడు: మైనంపాడు లో జూలై 2 న జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు
సంతనూతలపాడు: ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జూనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవి రమణారెడ్డి, సుందర రామిరెడ్డి బుధవారం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.