కనిగిరి: కేరళ మాజీ సీఎం పినరై విజయన్ నివాసం పై ఈడీ దాడులను ఖండిస్తూ కనిగిరిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
కనిగిరి: కేరళ మాజీ సీఎం పినరై విజయన్ నివాసం పై ఈడీ దాడులను నిరసిస్తూ కనిగిరి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కనిగిరి సిపిఎం పార్టీ కార్యదర్శి కేశవరావు మాట్లాడుతూ... దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఆదర్శ ప్రభుత్వాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా విజయన్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. అటువంటి నాయకుడి పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృతంలోని ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచివి కావన్నారు.