కళ్యాణదుర్గం: యాటకల్లులో రైతు చంద్రమోహన్ కు చెందిన పొలంలో షార్ట్ సర్క్యూట్, మంటల్లో కాలిపోయిన డ్రిప్పులు, పైపులు
సెట్టూరు మండలం యాటకల్లు గ్రామానికి చెందిన రైతు చంద్రమోహన్ పొలంలో బుధవారం షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. మంటల్లో డ్రిప్పులు, పైపులు కాలి బూడిదయ్యాయి. బాధిత రైతు చంద్రమోహన్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి శతవిధాల ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీ నష్టం వాటిల్లినట్లు బాధ్యత రైతు వాపోయాడు.