సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో రోజురోజుకు తీవ్రమవుతున్న మంచినీటి సమస్య
నాగులుప్పలపాడులోని ఉప్పుగుండూరులో రోజురోజుకు మంచినీటి సమస్య తీవ్రమవుతుంది. ఉప్పుగుండూరు లోని చింతతోపు కాలనీలో దాదాపు 40 కుటుంబాలు కాపురముంటున్నారు. కాలనీలో బోర్లు సరిగ్గా పనిచేయడం లేదు. ఉన్న తాగునీటిలో మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటూ గొంతు తడుపుకునేవారు. బావిలో నీరు అడుగంటే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. ఈ ప్రాంతంలో అధికారులు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసి, ఇంటింటికి తాగునీరు అందించాలని కోరుతున్నారు.