కనిగిరి: బీసీ రక్షణ చట్టం అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలం: కనిగిరిలో బీసీవై పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు నరేంద్ర
కనిగిరి: బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మార్కాపురం జిల్లా బీసీవై పార్టీ అధ్యక్షులు నరేంద్ర విమర్శించారు. కనిగిరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో పాదయాత్ర చేసిన ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బీసీలపై దాడులు జరుగుతున్నాయని, బీసీల కోసం రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంతవరకు రక్షణ చట్టం తీసుకురాలేదన్నారు. అదేవిధంగా బీసీల కులగనన పక్కాగా చేపట్టాలని, బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలన్నారు.