కనిగిరి: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: కనిగిరి సీఐ ఉప్పుటూరి శ్రీనివాసులు
కనిగిరి సర్కిల్ కార్యాలయంలో సీఐ ఉప్పుటేరు శ్రీనివాసులు కనిగిరి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బందితో నేర సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనిగిరి సర్కిల్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా దొంగతనాల నివారణకు రాత్రి వేళలో పోలీసుల గస్తీ ముమ్మరం చేయాలన్నారు.