కనిగిరి: నందన మారేళ్ళలో బిజెపి ఆధ్వర్యంలో మన ఊరు-మన జెండా కార్యక్రమం
కనిగిరి మండలం నందన మారేళ్ళ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో మన ఊరు- మన జెండా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మన ఊరు- మన జెండా జిల్లా కోకన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య బిజెపి జెండాను నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1980లో బిజెపి ఆవిర్భవించినప్పటి నుండి రెండు పార్లమెంటు సీట్లు మొదలు దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగింది అన్నారు. మూడుసార్లు దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి దేశాన్ని పరిపాలిస్తే, మరో మూడుసార్లు ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలిస్తూ , దేశ సమగ్రత, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.