రాప్తాడు: పంపునూరులో వైశాఖ మాసం శుద్ధ షష్టి సందర్భంగా శ్రీసుబ్రమణ్య స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో బుధవారం పది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు వైశాఖ మాసం శుద్ధ షష్టి సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి బాబు, చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యస్వామి వారికి వైశాఖమాసం శుద్ధ షష్టి పురస్కరించుకొని సుబ్రమణ్య స్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించి భక్తులందరికీ అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరిగిందని ఆలయ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆలయ కార్యనిర్వాణా అధికారి బాబు పేర్కొన్నారు.