గిద్దలూరు: రాచర్ల మండలం లోని నల్లమల అటవీ ప్రాంతంలో పులి మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించిన సీఐ రామకోటయ్య
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపిచెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతిచెందిన సంఘటన వెలుగు చూసిన విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య విచారణ చేపట్టినట్లు తెలిపారు. పులి మృతి చెందిన ప్రాంతాన్ని సిఐ గ్రామ కోటయ్య తన పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టామని అటవీశాఖ అధికారులకు సహాయంతో తాము విచారణ చేపడుతున్నట్లు సిఐ రామకోటయ్య తెలిపారు.