కనిగిరి: ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.