కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులపై అధికారులకు ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ పాలనాతి కాంపౌండ్ వాల్ నిర్మాణంతోపాటు, పచ్చతనాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తయ్యాలా చూడాలని సూచించారు.