సంతనూతలపాడు: నాగులుప్పలపాడు లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి నబీవలి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
నాగులుప్పలపాడు: జూన్ 28వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నాగులుప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నబీవలి ఆధ్వర్యంలో శనివారం నాగులుప్పలపాడు లో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి నబీవలి, డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో పట్టణంలో పల్స్ పోలియోపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని కొనసాగించారు. అప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రులు పల్స్ పోలియో కేంద్రాలలో పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.