కనిగిరి: పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్స్ జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపిన కార్మికులు
కనిగిరి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు లేబర్ కోడ్స్ జీవో ప్రతులను సోమవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ... కార్మికుల పొట్ట కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. తక్షణం లేబర్ కోడ్స్ రద్దుచేసి పాత కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.