కనిగిరి: కంచర్ల వారి పాలెం జడ్పీ ఉన్నత పాఠశాల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి మండలం కంచర్ల వారి పాలెం జడ్పీ ఉన్నత పాఠశాల హాస్టల్ ను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కున నరసింహారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఎమ్మెల్యే ఆరా తీశారు. మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, గదుల పరిశుభ్రతపై ఎమ్మెల్యే పరిశీలన చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి, నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.