కనిగిరి: అనంతపురం జిల్లా లాగా మార్కాపురం జిల్లాకు మేలు జరగనుంది: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు 2026 - 27 బడ్జెట్ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ... అనంతపురం జిల్లా లాగా వెనుకబడిన మార్కాపురం జిల్లాకు మేలు జరగనుందని జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మార్కాపురం జిల్లాకు వస్తాయన్నారు. పంటలు పండించే రైతులకు 90 శాతం లేదా 100 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. వెనుకబడిన కనిగిరి నియోజకవర్గానికి కూడా అత్యధిక నిధులు వచ్చి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.