కనిగిరి: ఉపాధి కూలీలకు రెండుసార్లు హాజరు సేకరణ తప్పనిసరి: వెలిగండ్ల ఏపీవో శ్రీనివాస్ నాయక్
వెలిగండ్ల: ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు ప్రభుత్వం రోజుకు 2సార్లు హాజరుతప్పనిసరిగా అమలు చేసిందని ఏపీవో శ్రీనివాస నాయక్ తెలిపారు. సోమవారం ఏపీవో మండలంలోని కొటాలపల్లి నాగిరెడ్డిపల్లిలో ఉపాధి పని ప్రదేశాలను సందర్శించి కూలీలకు పలు సూచనలను చేశారు. పని ప్రదేశానికి రాగానే ఒకసారి నాలుగు గంటలు పనిచేశాక మరోసారి హాజరు తప్పకుండా వేయించుకొని వెళ్లాలని కూలీలకు వివరించారు. ఉపాధి హామీ పనులలో అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తప్పవని ఏపీవో హెచ్చరించారు.