ఉరవకొండ: పీర్ల పండుగ మనదే- పర్యావరణ పరిరక్షణ మనదే అని పచ్చని చెట్లు బూడిద పాలు కాకూడదంటూ వినతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల వ్యాప్తంగా గ్రామాల్లో ఈ నెల 26న నిర్వహించే మతసామరస్యాల ప్రతీక పీర్ల పండుగ ప్రజలు సంప్రదాయ బద్ధ ఆచారంతో సంతోషంగా జరుపుకోవాలని, అలాగే పర్యావరణ పరిరక్షణకు సైతం కృషి చేయాలని మండల బి.జె.పి. జనసేన పార్టీల నాయకులు శుక్రవారం పేర్కొన్నారు. పీర్ల పండగ హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకుంటారు. అయితే ఈ పీర్ల పండుగ సందర్భంగా అగ్నిగుండంలోకి పచ్చని చెట్లను నరికి వేయకుండా ప్రజలలో పర్యావరణ బాధ్యతను గుర్తుచేసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని మండల అధికారులైన తహసీల్దార్ అనిల్ కుమార్, ఎం.పి.డి.ఓ లక్ష్మీనారాయణ, ఏ.ఎస్సై రామదాసుకు వినతిపత్రం అందజేశారు.