కనిగిరి: పట్టణంలోని 20వ వార్డులో రోడ్లకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు
కనిగిరి పట్టణంలోని 20 వ వార్డులో రోడ్లకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. గత 30 ఏళ్లుగా రోడ్లకు అడ్డుగా విద్యుత్ స్తంభాలు ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు వివరించారు. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు రోడ్లకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.