సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
చీమకుర్తి పట్టణంలో ప్రధాన రహదారుల్లో తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా చీమకుర్తి పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే బైపాస్ రోడ్డు, చీమలమర్రి, ఎర్రగుడిపాడు, రెడ్డి నగర్ ప్రాంతాల్లో వేగ నియంత్రణ కోసం పోలీసులు రేడియం స్టిక్కర్లతో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.