ఉరవకొండ: బెలుగుప్పలో ఎర్రి తాత ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉట్ల పరుస కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ ఎర్రితాత స్వామి 90వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి 6.30 గంటల వరకు ఉట్ల పరుస కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తులకు నేత్రపర్వంగా కొనసాగింది. బురద తో కూడిన ఉట్లమానును యువకులు పోటీపడి ఎక్కుతూ జారుతూ ఉన్న సన్నివేశాలు భక్తులను మైమరపించి నవ్వులు విరజుమ్మే విధంగా చేశాయి. ఉట్లమాను పరస చూసేందుకు వేల సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.