రాయదుర్గం: ధరల పెరుగుదలతో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, రాయదుర్గంలో రిటైల్ ఔట్‌లెట్ ప్రారంభం
ధరల పైరుగుదల నేపద్యంలో ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టింది. కణేకల్లు రైస్ మిల్లర్ల సహకారంతో ఆదివారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రిటైల్ ఔట్ లెట్ సెంటర్ ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు తహసీల్దార్ సూర్యప్రతాప్, రైస్ మిల్లర్ల అసోషియేషన్ అధ్యక్షుడు ఉప్పర ఆనంద్, టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ కమిటీ అధ్యక్షులు పూజారి శివప్రసాద్ తో కలసి ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.