సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో ఈనెల 20న మెడికల్ షాప్ ల బంద్
చీమకుర్తిలో ఈనెల 20న మెడికల్ షాపులు బంద్ చేస్తున్నట్లు పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథం, కార్యదర్శి రమేశ్ మంగళవారం తెలిపారు. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని అఖిలభారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు బంద్ నిర్వహిస్తున్నామని వారు వివరించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ముందుగానే మందులు తీసుకోవాలని కోరారు. చీమకుర్తి పట్టణంలోని మెడికల్ షాపుల నిర్వాహకులు బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.