సంతనూతలపాడు: తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలి: చీమకుర్తి మండల విద్యాశాఖ అధికారి నర్సింహారావు
చీమకుర్తి: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని చీమకుర్తి మండల విద్యాశాఖ అధికారి నరసింహారావు కోరారు. మంగళవారం చీమకుర్తి మండలం రంగసాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ అధికారి నరసింహారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తుంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం, విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు.